ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వడ్డీ రేట్లపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీ చెల్లిస్తామని తెలిపింది. గతంలో 8.15 శాతం ఉండగా దీన్ని 8.25 శాతానికి పెంచింది. ఇప్పటి వరకు ఇదే అత్యధిక వడ్డీ రేటు. దీంతో ఈపీఎఫ్ఓ సబ్ స్క్రైబర్లకు భారీ ప్రయోజనం చేకూరనున్నది. 2023-24 మధ్యలో గానీ, 2024-25 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో గానీ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకున్న తమ సబ్ స్క్రైబర్లకు సవరించిన వడ్డీ ప్రకారమే చెల్లింపులు జరుపుతామని 'ఎక్స్' వేదికగా తెలిపింది. సాధారణంగా ఈపీఎఫ్ నిల్వలపై వడ్డీరేటును ప్రతి ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత త్రైమాసికంలో ఖరారు చేస్తారు. స్మాల్ సేవింగ్ స్కీమ్స్, జీపీఎఫ్, పీపీఎఫ్ వంటి పథకాలపై వడ్డీరేట్లకంటే ఈపీఎఫ్ నిల్వలపై వడ్డీరేటు అధికం అని తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ నిల్వలపై 8.15 శాతం వడ్డీని కేంద్రం నిర్ణయించింది. గత ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం నోటిఫై చేసిన వడ్డీరేటు ప్రయోజనాలు అందరికీ అందాలన్న ఉద్దేశంతో ఫైనల్ సెటిల్మెంట్లు చేసుకుంటున్న సభ్యులందరికీ అదే వడ్డీ చెల్లిస్తున్నట్లు ఈపీఎఫ్ఓ వెల్లడించింది.
ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.25 శాతం !
الجمعة، 12 يوليو 2024
'ఎక్స్' వేదికగా తెలిపింది 2023-24 ఆర్థిక సంవత్సరం national ఇప్పటి వరకు ఇదే అత్యధిక వడ్డీ రేటు ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.25 శాతం జీపీఎఫ్ పీపీఎఫ్ వంటి పథకాలపై వడ్డీరేట్లకంటే అధికం స్మాల్ సేవింగ్ స్కీమ్స్
ليست هناك تعليقات:
إرسال تعليق