దేశీయ మార్కెట్లో  ఆగస్టు 7న వివో వి 40 సిరీస్ ను విడుదల చేస్తున్నట్లు వివో ప్రకటించింది. వివో వి 40 సిరీస్ నుంచి వి 40 మరియు వి 40 ప్రో రెండు ఫోన్ లను విడుదల కానున్నాయి.  వివో వి 40 సిరీస్ నుంచి తీసుకు రాబోతున్న స్మార్ట్ ఫోన్స్ సరికొత్త డిజైన్ మరియు మూడు కలర్ లలో కనిపిస్తున్నాయి. ఈ వి 40 సిరీస్ ఫోన్ లను గొప్ప కెమెరా సెటప్ మరియు ఫీచర్స్ తో తీసుకొస్తున్నట్లు వివో గొప్పగా చెబుతోంది. వివో వి 40 సిరీస్ ఫోన్ లను ZEISS ఆప్టిక్స్ కలిగిన 4 పవర్ ఫుల్ కెమెరాలతో తీసుకువస్తోంది. ఈ సిరీస్ ఫోన్ లలో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టం వుంది. ఇందులో 50MP (Sony IMX 921) మొయిన్ కెమెరా, 50MP (Sony IMX 816) టెలీఫోటో జతగా 50MP అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. అంతేకాదు, ఈ ఫోన్ లో ముందు 50MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. అంటే, ఈ ఫోన్ లో మొత్తంగా నాలుగు 50MP కెమెరాలు ZEISS ఆప్టిక్స్ తో వస్తాయి. కెమెరా సెటప్ తో పాటు ZEISS కెమెరా ఫీచర్స్ మరియు ఫిల్టర్స్ ను కూడా జత చేసినట్లు వివో తెలిపింది. ఈ ఫోన్ 3D కర్వుడ్ డిస్ప్లే ని కలిగి వుంది. అంతేకాదు, IP68 రేటింగ్ తో వాటర్ రెసిస్టెంట్ గా ఈ సిరీస్ ఫోన్ లు ఉంటాయి. ఈ ఫోన్ లను 5500 mAh హెవీ బ్యాటరీ మరియు ఈ బ్యాటరీ ని వేగంగా ఛార్జ్ చేసే 80W ఫ్లాష్ ఛార్జ్ 4 ఫాస్ట్ ఛార్జ్ టెక్ సపోర్ట్ తో తీసుకొస్తున్నట్లు కూడా వివో వివరించింది. ఈ ఫోన్ లను లోటస్ పర్పల్, గంజెస్ బ్లూ మరియు టైటానియం గ్రే మూడు కలర్ లలో విడుదల చేస్తోంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ