ఆంధ్రప్రదేశ్ లోని అంబేద్కర్ కోసం జిల్లా గంటి పెదపూడి పడవ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. పడవ ప్రమాదంలో గల్లంతైన బాధ్యత కుటుంబానికి రూ. 5 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. నదిలో వరద ఉధృతి తగ్గేంత వరకు లంక గ్రామాల ప్రజలు, గోదావరి పరివాహక ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. మరోవైపు పి.గన్నవరం మండలం గంటి పెదపూడి వద్ద బోటు ప్రమాద సంఘటన స్థలాన్ని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. బోటు ప్రమాదంలో గల్లంతైన చదలవాడ విజయ్ కుమార్ కుటుంబ సభ్యులను కలెక్టర్ పరామర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించిన రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా రేపు బాధిత కుటుంబానికి అందజేస్తామని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు.
పడవ ప్రమాదంలో గల్లంతైన యువకుడి కుటుంబానికి రూ.5 లక్షలు ఎక్స్గ్రేషియా !
الأحد، 28 يوليو 2024
Andhra Pradesh గోదావరి పరివాహక ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచన పడవ ప్రమాదంలో గల్లంతైన యువకుడి కుటుంబానికి రూ.5 లక్షలు ఎక్స్గ్రేషియా
ليست هناك تعليقات:
إرسال تعليق