ఆంధ్రప్రదేశ్‌లో 37 మంది ఐపీఎస్‌ అధికారుల బదిలీ


ఆంధ్రప్రదేశ్‌లో 37 మంది ఐపీఎస్‌ అధికారులు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని రఘువీరారెడ్డి, సిద్దార్థ్‌ కౌశల్‌, ఎస్‌.శ్రీధర్‌, సుమిత్‌ సునీల్‌, పి.జగదీశ్‌, పత్తిబాబు, రాధిక, మేరీ ప్రశాంతి, ఆరిఫ్‌ హఫీజ్‌ను ప్రభుత్వం ఆదేశించింది. శ్రీకాకుళం జిల్లా - కేవీ మహేశ్వర్‌రెడ్డి, విజయనగరం- వకుల్‌ జిందాల్‌, అనకాపల్లి- ఎం.దీపిక,  సత్యసాయి జిల్లా- వి.రత్న, పార్వతీపురం మన్యం - ఎస్వీ మాధవరెడ్డి, కాకినాడ- విక్రాంత్‌ పాటిల్‌, గుంటూరు- ఎస్‌.సతీశ్‌ కుమార్‌, అల్లూరి సీతారామరాజు జిల్లా - అమిత్‌ బర్దార్‌, విశాఖ సిటీ డిప్యూటీ కమిషర్‌ 1- అజితా వేజెండ్ల, విశాఖ సిటీ డిప్యూటీ కమిషర్‌ 2గా - తుహిన్‌ సిన్హా, తూర్పుగోదావరి- డి.నరసింహ కిషోర్‌, అన్నమయ్య జిల్లా- వి.విద్యాసాగర్‌ నాయుడు, కోనసీమ జిల్లా - బి.కృష్ణారావు, కృష్ణా ఎస్పీ- ఆర్‌.గంగాధర్‌రావు, పశ్చిమగోదావరి జిల్లా - అద్నాన్‌ నయీమ్‌ ఆస్మీ, ఏలూరు జిల్లా- కె.ప్రతాప్‌ శివకిశోర్‌, పల్నాడు జిల్లా - కె.శ్రీనివాసరావు, ఏపీఎస్పీ విజయనగరం బెటాలియన్‌ కమాండెంట్‌- మల్లికాగార్గ్‌, ప్రకాశం- ఏ.ఆర్‌.దామోదర్‌, కర్నూలు- జి.బిందు మాధవ్‌, నెల్లూరు జిల్లా- జి.కృష్ణకాంత్‌, నంద్యాల- అధిరాజ్‌సింగ్‌ రానా, కడప - వి.హర్షవర్ధన్‌ రాజు, అనంతపురం - కేవీ మురళీ కృష్ణ, బాపట్ల- తుషారు డూడీ, తిరుపతి - ఎల్‌.సుబ్బారాయుడు (ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్‌ ఎస్పీగా అదనపు బాధ్యతలు, ఎన్టీఆర్‌ జిల్లా డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌గా (శాంతి భద్రతలు) గౌతమీ శాలి, ఇంటెలిజెన్స్ అడ్మిన్‌ ఎస్పీగా వి.గీతాదేవి. 

Post a Comment

0 Comments