ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది. ఈ మేరకు ఏపీపీఎస్సీ ప్రకటన చేసింది. జులై 28వ తేదీన నిర్వహించే గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలంటూ అభ్యర్థులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. వీరందరి అభ్యర్థన దృష్ట్యా సానుకూల నిర్ణయం తీసుకోవాలంటూ ప్రభుత్వాన్ని పలువురు కోరారు. ఈ క్రమంలో.. గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేశారు. తదుపరి పరీక్షా తేదీని త్వరలో తెలుపుతామని ఏపీపీఎస్సీ ప్రకటించింది. జూలై 28న నిర్వహించాల్సిన గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలను రెండు నెలల పాటు వాయిదా వేయాలని ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువజన జేఏసీ, ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ జేఏసీ నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అనేక మంది అభ్యర్థులు ఎన్నికల విధుల్లో ఉన్నారని, మరికొందరు ఎన్నికల ప్రక్రియలో బిజీగా ఉంటూ పరీక్షలకు ప్రిపేర్ కాలేకపోయారని తెలిపారు.
0 Comments