థ్రెడ్స్ యాప్ కీలక మైలురాయిని చేరుకున్నట్లు మెటా సంస్థ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా థ్రెడ్స్ ప్లాట్‌ఫాం 175 మిలియన్ల నెలవారీ యాక్టివ్ యూజర్లకు చేరుకుందని ప్రకటన చేశారు. అందులో భారత యూజర్లు అధికంగా ఉన్నట్లు తెలిపారు. గత సంవత్సరం థ్రెడ్స్ ప్లాట్‌ఫాంను మెటా అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన ఎలాన్ మస్క్ అందులో అనేక మార్పులు చేశారు. దీంతో అనేక మంది యూజర్లలో అసంతృప్తి వ్యక్తమైంది. ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకొనేందుకు మెటా ఈ ప్లాట్‌ఫాంను పోటీగా లాంచ్ చేసింది. అయితే ప్రారంభంలో రికార్డు స్థాయిలో యూజర్లను సంపాందించుకుంది. అయితే కొన్ని కారణాలతో కొద్దికాలంలోనే యూజర్లు థ్రెడ్స్‌ను పక్కన పెట్టేశారు. మెటా మాత్రం ఈ పరిస్థితిని చక్కదిద్దుతూ వచ్చింది. యూజర్ల సౌకర్యం కోసం అనేక కొత్త ఫీచర్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫలితంగా కీలక మైలురాయిని చేరుకోగలిగింది. దీంతోపాటు జుకర్‌బర్గ్ అనేక ఆసక్తికర అంశాలను వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా థ్రెడ్స్ యూజర్లు 50 మిలియన్ల ట్యాగ్స్ రూపొందించినట్లు చెప్పారు. భారత్‌లో సినిమాలు, టీవీ, OTT సహా సెలబ్రిటీలు మరియు క్రీడల కోసం ఎక్కువగా ట్యాగ్స్ ఎక్కువగా ట్రెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. థ్రెడ్స్ కమ్యూనిటీలు.. స్నేహపూర్వక సంభాషణలకు వేదికగా మారినట్లు తెలిపారు. థ్రెడ్స్ ట్యాగ్స్ ఫీచర్ ద్వారా యూజర్లు తమకు నచ్చిన అంశాలను ట్యాగ్ చేస్తున్నారు. భారత్‌కు సంబంధించి థ్రెడ్స్ యాప్ లో #Gunturkaaram, #Kalki2898AD, #HouseofDragon, #KotafactoryS3, #BTS11thanniversary మరియు #AditiRaoHydari సహా మరిన్ని ట్యాగ్ లు ట్రెండింగ్ లు ఉన్నట్లు చెప్పారు. దీంతోపాటు క్రెకెట్ పైనా భారీగా ట్యాగ్స్ క్రియేట్ అయినట్లు మార్క్ జుకర్‌బర్గ్ చెప్పారు.
175 మిలియన్ల నెలవారీ యాక్టివ్ యూజర్లకు చేరుకున్న థ్రెడ్స్ యాప్ !
الخميس، 4 يوليو 2024
175 మిలియన్ల నెలవారీ యాక్టివ్ యూజర్లకు చేరుకున్న థ్రెడ్స్ యాప్ science technology భారత యూజర్లు అధికం మెటా సంస్థ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ వెల్లడి
ليست هناك تعليقات:
إرسال تعليق