జింబాబ్వేతో హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరిగిన నాలుగో టీ20 లో 10 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఈ విజయంతో 3-1 తేడాతో భారత్ సిరీస్ కైవసం చేసుకుంది. 153 పరుగుల లక్ష్యాన్ని15.2 ఓవర్లలోనే ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఛేదించింది. యశస్వి జైస్వాల్ 93, శుభ్‌మన్ గిల్ 53 పరుగులు చేశారు. భారత ఓపెనర్లు యశస్వీ జైస్వాల్, శుభ్ మన్ గిల్ లు దూకుడు ముందు జింబాబ్వే బౌలర్లు చేతులెత్తేశారు. ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా భారీ షాట్లతో టీమిండియా ఆటగాళ్లు విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో ఇద్దరు ఆటగాళ్లు ఆఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. జింబాబ్వే బ్యాటర్లలో కెప్టెన్ సికిందర్ రజా 28 బంతుల్లో 46 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. తడివానాషే మారుమణి (32), వెస్లీ మాధేవెరే (25)లు ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు తీశాడు. వాషింగ్టన్ సుందర్, తుషార్ దేశ్ పాండే, అభిషేక్ శర్మ, శివమ్ దూబె లు తలా ఓ వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో టీమిండియా సిరీస్ ను 3-1 తేడాతో సొంతం చేసుకుంది. చివరి నామమాత్రపై టీ20 ఆదివారం జరగనుంది.
0 Comments