తెలంగాణలో ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీ, పదోన్నతుల షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది. ఈ నెల 8 నుంచి ఉపాధ్యాయుల బదిలీ, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం కానుంది. పదవీ విరమణకు మూడు ఏండ్ల లోపు ఉన్న వారికి తప్పనిసరి బదిలీ నుంచి మినహాయింపు ఇవ్వనున్నారు. మల్టీ జోన్ 1లో శనివారం నుంచి ఈ నెల 22వ తేదీ వరకు, మల్టీ జోన్ 2లో రేపటి నుంచి ఈ నెల 30 వరకు బదిలీలు, పదోన్నతులు చేపట్టనున్నారు. కోర్టు కేసులతో గతంలో ఎక్కడ ప్రక్రియ ఆగిపోయిందో అక్కడి నుంచి బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది. టెట్‌తో సంబంధం లేకుండానే ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ జరగనుంది.
తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీ, పదోన్నతుల షెడ్యూల్ విడుదల
الجمعة، 7 يونيو 2024
8 నుంచి ఉపాధ్యాయుల బదిలీ తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీ పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం పదోన్నతుల షెడ్యూల్ విడుదల మల్టీ జోన్ 1లో శనివారం నుంచి 22వరకు మల్టీ జోన్ 2లో రేపటి నుంచి 30 వరకు
ليست هناك تعليقات:
إرسال تعليق