ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు వదనమ్మ సురేఖ అత్యంత ఖరీదైన మోంట్‌బ్లాంక్ పెన్నును గిఫ్ట్‌గా ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను మెగాస్టార్ చిరంజీవి ట్వీట్టర్‌లో పోస్ట్ చేశారు. కళ్యాణ్ బాబుకు వదినమ్మ బహుమతి ! అంటూ వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు. వదినమ్మ సురేఖ స్వయంగా పెన్నును పవన్ జేబులో పెట్టగా అది చూసి పవన్ సంబపడిపోయాడు. దీంతో తనవద్ద ఉన్న పెన్నుతో పాటుగా వదిన ఇచ్చిన గిఫ్ట్‌ని కూడా జేబులో పెట్టుకుంటూ తెగ ఆనందపడ్డారు. అనంతరం అన్నయ్య చిరంజీవి, పవన్ సతీమణి అన్నాలెజినోవాతో కలిసి ఫోటో తీసుకున్నారు. 'తెలుగు ప్రజల ఆకాంక్షల్ని నిజం చేస్తావని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ.. వదిన, అన్నయ్య' అంటూ వీడియో ముగిసింది. అయితే పవన్ కళ్యాణ్‌కు వదినమ్మ గిఫ్ట్‌గా ఇచ్చిన మోంట్ బ్లాంక్ డిస్నీ ఎడిషన్ పెన్నుల ధరల శ్రేణి రూ.90 వేల నుంచి రూ.2.60లక్షల వరకూ ఉంటుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
కళ్యాణ్ బాబుకు వదినమ్మ బహుమతి !
السبت، 15 يونيو 2024
Andhra Pradesh telangana కళ్యాణ్ బాబుకు వదినమ్మ బహుమతి మెగాస్టార్ చిరంజీవి ట్వీట్టర్‌లో పోస్ట్ సురేఖ అత్యంత ఖరీదైన మోంట్‌బ్లాంక్ పెన్నును గిఫ్ట్‌గా ఇచ్చారు
ليست هناك تعليقات:
إرسال تعليق