కేంద్రంలో బీజేపీ మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా నేపథ్యంలో పార్టీ సీనియర్ నేతలు కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్నారు. ఫలితాలు వెలువడనున్న తరుణంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధాని మోడీ నాయకత్వంలో కాషాయదళం గెలుపు సాధిస్తుందని ధీమా వ్యక్తంచేస్తున్నారు. కౌంటింగ్ సంబంధించిన అంశాలపై చర్చించినట్లు బీజేపీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే తెలిపారు. ఉత్సవాలపై పార్టీ ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ఫలితాల అనంతరం దానిపై ఆలోచిస్తామని చెప్పారు.
బీజేపీ కీలక నేతలు సమావేశం !
الاثنين، 3 يونيو 2024
BJP national అమిత్ షా కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్ బీజేపీ కీలక నేతలు సమావేశం బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా మోడీ నాయకత్వంలో కాషాయదళం గెలుపు సాధిస్తుందని ధీమా
ليست هناك تعليقات:
إرسال تعليق