తెలంగాణ సచివాలయంలోకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాకపోకలు సాగించే మార్గాల విషయంలో అధికారులు స్వల్ప మార్పులు చేశారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన ద్వారం నుంచి లోపలికి వచ్చేవారు. ఇక నుంచి అధికారులు అందులో కొన్ని మార్పులు చేశారు. ఇప్పటి నుండి సీఎం కాన్వాయ్ వెస్ట్ గేట్ నుంచి లోపలికి వచ్చి నార్త్ ఈస్ట్ గేట్ గుండా బయటకు వెళ్లేటట్టు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు ప్రధాన గేటును మూసివేశారు. అంతేగాక ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల రాకపోకల అంశంలో కూడా పలు మార్పులు చేసినట్టు సచివాలయ అధికారులు తెలిపారు. ఇకనుండి ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నతాధికారులు సౌత్ ఈస్ట్ గేట్ ద్వారా రాకపోకలు సాగిస్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సెక్రటేరియట్ రాకపోకలపై మార్పులు చేయడం ఇదే మొదటిసారి. గతంలో ముఖ్యమంత్రి కార్యాలయాన్ని మాత్రమే ఆరో అంతస్థు నుంచి తొమ్మిదో అంతస్థుకు మార్చాలని అధికారులు నిర్ణయించగా, ప్రస్తుతం తొమ్మిదో అంతస్థులో దానికి సంబందించిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.
తెలంగాణ సచివాలయం రాకపోకల మార్గాల్లో స్వల్ప మార్పులు !
الاثنين، 3 يونيو 2024
telangana తెలంగాణ సచివాలయం రాకపోకల మార్గాల్లో స్వల్ప మార్పులు తొమ్మిదో అంతస్థులో దానికి సంబందించిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి ముఖ్యమంత్రి రాకపోకలు సాగించే మార్గాలలో స్వల్ప మార్పులు
ليست هناك تعليقات:
إرسال تعليق