పోక్సో కేసులో యడియూరప్పకు హైకోర్టులో ఊరట !
الجمعة، 14 يونيو 2024
karnataka జూన్ 17 వరకు ఆయనను అరెస్టు చేయకూడదని ఆదేశించింది పోక్సో కేసులో యడియూరప్పకు హైకోర్టులో ఊరట మైనర్ బాలికను వేధించాడనే ఆరోపణపై
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, భాజపా నేత బీఎస్ యడియూరప్పకు లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ జరిగే జూన్ 17 వరకు ఆయనను అరెస్టు చేయకూడదని ఆదేశించింది. మైనర్ బాలికను వేధించాడనే ఆరోపణపై నమోదైన పోక్సో కేసులో బెంగళూరు కోర్టు మాజీ సీఎంపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ కి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం చేపడుతోన్న విచారణకు సంబంధించిన ఫిర్యాదును కొట్టివేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి అక్కడి హైకోర్టును ఆశ్రయించారు. జూన్ 17న సీఐడీ ముందు యడియూరప్ప హాజరుకానున్నారని, అరెస్టును నిలిపివేయాలని ఆయన తరపు న్యాయవాది కోరారు. అందుకు కోర్టు అంగీకరించింది. ప్రస్తుతం ఆయన దిల్లీలో ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై భాజపా స్పందిస్తూ ''లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన కాంగ్రెస్ నేతలు భాజపాపై కుట్రలు పన్నుతున్నారని ఆరోపించింది. మానసిక స్థితి సరిగా లేని మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా యడియూరప్పను అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తోందని మండిపడింది. ఇదిలాఉంటే, బెంగళూరులోని డాలర్స్ కాలనీలో సీఎం నివాసంలో తన కుమార్తెను వేధించాడని 17 ఏళ్ల బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు యడియూరప్పపై ఈ కేసు నమోదైంది.
ليست هناك تعليقات:
إرسال تعليق