ఉత్తరప్రదేశ్ లో ఊహించని రీతిలో ఎన్డీఏ కూటమికి షాక్ ఇస్తూ ఇండియా కూటమి ముందుకు దూసుకెళ్తుంది. సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ ఎంపీగా ఎన్నికయ్యారు. మైన్ పురి స్థానంలో పోటీ చేసిన ఆమె 2,21,639 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మరోవైపు నార్త్ గోవాలో బీజేపీ అభ్యర్థి శ్రీపాద్ నాయక్ వరుసగా ఆరోసారి విక్టరీ అందుకున్నారు. సౌత్ గోవాలో కాంగ్రెస్ అభ్యర్థి విరియాటో ఫెర్నాండెజ్ విజయం సాధించారు. ఝార్ఖండ్ గాంధే అసెంబ్లీ ఉపఎన్నికలో మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పన సోరెన్ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి దిలీప్ కుమార్పై ఆమె 1,148 ఓట్ల తేడాతో గెలుపొందారు. కల్పనకు 16,203 ఓట్లు పోలవ్వగా, బీజేపీ అభ్యర్థికి 15,055 ఓట్లు వచ్చాయి. నోటాకు 743 ఓట్లు రావడం గమనార్హం.
ఊహించని రీతిలో ఎన్డీఏ కూటమికి షాక్ ఇచ్చిన ఇండియా కూటమి !
الثلاثاء، 4 يونيو 2024
congress national uttara pradesh ఊహించని రీతిలో ఎన్డీఏ కూటమికి షాక్ ఇచ్చిన ఇండియా కూటమి ముందుకు దూసుకెళ్తుంది
ليست هناك تعليقات:
إرسال تعليق