బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఏ) పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా నరేంద్ర మోడీని ఎన్నుకున్న తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నరేంద్ర మోడీని ఆహ్వానించారు. జూన్ 9 సాయంత్రం 6 గంటలకు నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతిని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన నరేంద్ర మోడీ తనను ప్రధానమంత్రిగా నియమిస్తూ రాష్ట్రపతి ముర్ము తనకు లేఖ ఇచ్చారని, ప్రమాణ స్వీకారోత్సవానికి అనుకూలమైన సమయానికి సంబంధించిన వివరాలను కోరారని చెప్పారు. తనతో ప్రమాణ స్వీకారం చేసేందుకు మంత్రుల జాబితాను కూడా ఆమె కోరినట్లు మోడీ తెలిపారు. జూన్ 9వ తేదీ సాయంత్రం ప్రమాణ స్వీకారానికి సిద్ధంగా ఉంటామని ముర్ముకు చెప్పానన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు రాష్ట్రపతి ఆహ్వానించిన నేపథ్యంలో, నరేంద్ర మోడీ ఈ నెల 9న ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ప్రభుత్వ ఏర్పాటుకు నరేంద్ర మోడీని ఆహ్వానించిన రాష్ట్రపతి !
الجمعة، 7 يونيو 2024
national ఎన్‌డిఏ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా నరేంద్ర మోడీ ప్రభుత్వ ఏర్పాటుకు నరేంద్ర మోడీని ఆహ్వానించిన రాష్ట్రపతి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ليست هناك تعليقات:
إرسال تعليق