బీఆర్‌ఎస్ పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై బీఆర్‌ఎస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. కాగా, ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్లే విషయంపై బీఆర్‌ఎస్ నేతలు న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా ఈనెల 27న దానం నాగేందర్ అనర్హత పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరుగనుంది. దానంతో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ బీఫామ్‌తో పలువురు నేతలు విజయం సాధించారు. అనంతరం, కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో పలువురు ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరారు. ఈ నేపథ్యంలోనే బీఆర్‌ఎస్.. అంతకుముందు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇక, తాజాగా ఆదివారం కూడా జగిత్యాల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నబీఆర్ఎస్ ?
الاثنين، 24 يونيو 2024
27న దానం నాగేందర్ అనర్హత పిటిషన్‌పై హైకోర్టులో విచారణ telangana న్యాయ నిపుణులతో చర్చలు పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నబీఆర్ఎస్ ?
ليست هناك تعليقات:
إرسال تعليق