తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తొలి విజయం నమోదైంది. ఖమ్మం పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన రామసహాయం రఘురామిరెడ్డి భారీ విజయం సాధించారు. సుమారు 4 లక్షల ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు. కాంగ్రెస్ గెలుపుతో బీఆర్‌ఎస్ తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. రఘురాంరెడ్డి గెలుపు కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ముగ్గురు మంత్రులు బాధ్యతలు తీసుకొని ప్రచారం చేశారు. ఈ స్థానం ఇన్‌చార్జీ పొంగులేటి శ్రీనివాస్ అన్నీ తానై వ్యహరించి రఘురాంరెడ్డి గెలుపులో కీలకం అయ్యారు. సీనియర్ నేత రామసహాయం సురేందర్ రెడ్డి కుమారుడే రఘురాంరెడ్డి. మంత్రి పొంగులేటి, సినీ నటుడు వెంకటేష్ కి వియ్యంకుడు అవుతారు.
0 Comments