టమాటా ధరలు ఇప్పుడిప్పుడే దిగి వచ్చే అవకాశాలు లేవు. ఇప్పటికే టమాటా ధరలు వంద రూపాయల వరకూ చేరుకుంది. రైతు బజార్లలో కిలో టమాటా ధర ఎనభై నుంచి డెబ్బయి రూపాయల వరకూ విక్రయిస్తున్నారు. బయట మార్కెట్ లో ఎక్కువ ధర పలుకుతుంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది టమాటా దిగుమతులు తక్కువగా ఉన్నాయి. ఉన్న కొద్ది టమాటాను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుండటంతో ఒక్కసారిగా ధరలు పెరుగుతున్నాయి. రానున్న కాలంలో ధరలు మరింత ప్రియమవుతాయని వ్యాపారులు చెబుతున్నారు. పత్తికొండ, మదనపల్లి మార్కెట్ కు కూడా తక్కువగానే టమాటాలు వస్తున్నాయి. సెప్టెంబరు నాటికి కాని ధరలు తగ్గవని చెబుతున్నారు. అప్పుడే పంట చేతికి వస్తుందని వ్యాపారులు చెబుతున్నారు. అప్పటి వరకూ ధరలు పెరుగడమే కాని తగ్గడం అంటూ జరగవని రైతులు కూడా చెబుతున్నారు. ప్రస్తుతం వేసిన పంట చేతికి అందేసరికి సెప్టంబరు అవుతుందని, అప్పుడే ధరలు తగ్గుతాయని, అప్పటి వరకూ టమాటాను రుచి చూడటం కూడా కష్టమేనని వినియోగదారులు వాపోతున్నారు.
సెప్టెంబరు వరకు టమాటా ధరలు ఇంతేనా ?
السبت، 29 يونيو 2024
Andhra Pradesh national telangana పత్తికొండ మదనపల్లి మార్కెట్ రైతు బజార్లలో కిలో టమాటా ధర ఎనభై నుంచి డెబ్బయి రూపాయల వరకూ సెప్టెంబరు వరకు టమాటా ధరలు ఇంతేనా ?
ليست هناك تعليقات:
إرسال تعليق