తెలంగాణలో మరోమూడురోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలుపడుతాయని తెలిపింది.ఈ మేరకు ఆయా జిల్లాలకు ఇప్పటికే వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి,ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్,మేడ్చల్ మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలో అక్కడ మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు ఉమ్మడి ఆదిలాబాద్‌తో పాటు నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి,మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడుతాయని ,మంగళవారం నుంచి బుధవారం వరకు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలతో పాటు సిద్ధిపేట, హైదరాబాద్, భువనగిరి, రంగారెడ్డి,మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు.
తెలంగాణలో మరో మూడురోజుల పాటు వర్షాలు !
الأحد، 23 يونيو 2024
telangana weather ఈదురుగాలులతో కూడిన వర్షాలు తెలంగాణలో మరో మూడురోజుల పాటు వర్షాలు పలుచోట్ల ఉరుములు మెరుపులు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ
ليست هناك تعليقات:
إرسال تعليق