తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ఓ ఇంజినీర్‌ను దారుణ హత్య చేశారు. ఇజాయత్ అలీ కొన్ని రోజుల క్రితం దుబాయ్ నుంచి ఇండియాకు వచ్చాడు. కారులో వచ్చిన దుండగులు ఇంజనీర్‌ను కదలకుండా పట్టుకోగా, మరొకరు కత్తితో గొంతు కోసి హత్య చేశారు. అనంతరం పరారైనట్లు తెలుస్తోంది. వారిలో ఇద్దరు యువకులు కాగా, ఓ యువతి ఉన్నట్లు సమాచారం. హత్య అనంతరం క్వాలిస్ వాహనాన్ని అక్కడే విడిచిపెట్టి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుల వాహనాన్ని, రెండు ఫోన్లను సీజ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
నార్సింగిలో ఇంజినీర్ దారుణ హత్య !
السبت، 29 يونيو 2024
Criem hyderabad telangana ఇజాయత్ అలీ ఇద్దరు యువకులు ఓ యువతి కత్తితో గొంతు కోసి హత్య నార్సింగిలో ఇంజినీర్ దారుణ హత్య
ليست هناك تعليقات:
إرسال تعليق