తెలంగాణలోని ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ (59) కన్నుమూశారు. శుక్రవారం అర్ధరాత్రి ఉట్నూర్‌లోని తన నివాసంలో అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తీసుకువస్తుండగా మార్గమధ్యంలో ఇచ్చోడ వద్ద తుది శ్వాస విడిచారు. ఆయన భౌతికకాయాన్ని ఉట్నూర్‌కు తరలించారు. ఆయన మృతి పట్ల పలువురు నేతలు సంతాపం ప్రకటించారు. తెదేపా తరఫున 1999లో ఖానాపూర్ ఎమ్మెల్యేగా రమేష్ రాథోడ్ ఎన్నికయ్యారు. 2009లో ఆ పార్టీ నుంచి ఆదిలాబాద్ ఎంపీగా గెలుపొందారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెదేపా నుంచి భారాసలో చేరారు. అనంతర పరిణామాల్లో కాంగ్రెస్‌లో చేరి 2019లో ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత భాజపాలోకి వెళ్లారు.
మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూత !
السبت، 29 يونيو 2024
1999లో ఖానాపూర్ ఎమ్మెల్యేగా 2009లో ఆ పార్టీ నుంచి ఆదిలాబాద్ ఎంపీగా తర్వాత భాజపాలోకి వెళ్లారు తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెదేపా నుంచి భారాసలో చేరారు మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూత
ليست هناك تعليقات:
إرسال تعليق