ఎండకాలం ప్రతిరోజు ఆరెంజ్ జ్యూస్ తీసుకోవడం వల్ల మన శరీరానికి ప్రయోజనాలు కలుగుతాయి. ఆరెంజ్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. సీజనల్ వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడుతాయి. అంతేకాదు ఆరెంజ్ లో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ ని కూడా పెంచుతుంది. ఆరెంజ్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీని జ్యూస్ తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యానికి కూడా ప్రేరేపిస్తుంది. వేసవి వేడిలో ఆరంజ్ జ్యూస్ తప్పనిసరిగా మీ డైట్లో చేర్చుకోవాలి. దీంతో శక్తివంతంగా ఉంటారు. ఇందులో విటమిన్ సి, పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ తగ్గిస్తుంది. అంతే కాదు రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది. కొలెస్ట్రాల్ని తగ్గించే సమర్థవంతమైన శక్తి ఆరెంజ్ ఉంది. దీంతో హార్ట్ ఎటాక్ సమస్యలు రావని ఎన్ హెచ్ ఐ తెలిపింది. ఆరంజ్ లో ఫైబర్ అధికంగా మోతాదులో ఉంటుంది. ఇది కడుపు సంబంధిత క్యాన్సర్ కి వ్యతిరేకంగా పోరాడుతుంది. ఆ కణాల అభివృద్ధి కాకుండా పనిచేస్తుంది. ఆరెంజ్ మీ డైట్లో చేర్చుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, మలబద్ధకానికి కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల బరువు సులభంగా తగ్గుతారు. ఎక్కువ శాతం కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. అందుకే అతిగా తినకుండా ఉంటారు. దీంతో వెయిట్ కూడా ఈజీగా తగ్గుతారు. వెయిట్ లాస్ జర్నీలో ఉన్నవారు ఆరేంజ్ జ్యూస్‌ తప్పకుండా డైట్లో చేర్చుకోవాలి. విటమిన్ సీ పుష్కలంగా ఉండటం వల్ల ఇది కిడ్నీ రాళ్లు ఏర్పడకుండా నివారిస్తుంది. యూరిన్ సాఫీగా బయటకు వెళ్లేలా చేస్తుంది. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా కాపాడుతుంది. ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది .అంతేకాదు సీజనల్‌ వ్యాధులు మీ దరిచేరకుండా ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరచడంలో కీలకపాత్ర పోషిస్తుందని ఎన్ఐహెచ్ తెలిపింది.

Advertisement

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    Featured Post

    QooQ