జార్ఖండ్ లో కల్పనా సోరెన్ ఎమ్మెల్యేగా స్పీకర్ ఆమె చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఇటీవల లోక్ సభ ఎన్నికలతోపాటు జార్ఖండ్ లోని గంధే అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కల్పనా సోరెన్ విజయం సాధించారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ఆమె ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమయ్యేందుకు తమకు చాలా తక్కువ సమయం ఉందన్నారు. జార్ఖండ్ ప్రజలు తమపై అమితమైన ప్రేమాభిమానాలు చూపిస్తున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల కోసం మహాకూటమి పార్టీలోని ప్రతి కార్యకర్త తమవంతు బాధ్యత నిర్వహిస్తారని చెప్పారు. కల్పనా సోరెన్ ప్రమాణస్వీకార కార్యక్రమం జార్ఖండ్ సీఎం చంపాయ్ సోరెన్ సమక్షంలో జరిగింది. ఓ అవినీతి కేసులో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ను ఈడీ అరెస్ట్ చేసింది. దాంతో చంపాయ్ సోరెన్ జార్ఖండ్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు కల్పనా సోరెన్ ను జేఎంఎం స్టార్ క్యాంపెయినర్ గా కల్పనా సోరెన్ ను సిద్ధం చేస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం విజయం సాధిస్తే కల్పనా సోరెన్ ను ముఖ్యమంత్రిని చేసే దిశగా ఆ పార్టీ పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తున్నది.
0 Comments