బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ హైదరాబాద్ గన్‌పార్క్ వద్దకు చేరుకుని క్యాండిల్ ర్యాలీని ప్రారంభించారు.గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపం నుంచి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ఎదురుగా ఉన్న అమరజ్యోతి వరకు క్యాండిల్ ర్యాలీ కొనసాగనుంది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , ఎమ్మెల్యే కేటీఆర్‌తోపాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, జంట నగరాల పార్టీ శ్రేణులతో భారీ ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా, ప్రభుత్వం నిర్వహిస్తున్న రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో తమ పార్టీ పాల్గొనదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి లేఖ రాసిన ఆయన ‘తెలంగాణ అస్థిత్వాన్ని అవమానిస్తున్న కాంగ్రెస్ పోకడలను నిరసిస్తున్నాం. ఇకనైనా వైఖరి మార్చుకుని సంక్షేమం కోసం పాటుపడాలి. బీఆర్ఎస్ ను రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా అవమానించింది’ అని అన్నారు.
క్యాండిల్ ర్యాలీ ప్రారంభించిన కేసీఆర్ !
السبت، 1 يونيو 2024
telangana అమరజ్యోతి వరకు క్యాండిల్ ర్యాలీ క్యాండిల్ ర్యాలీ ప్రారంభించిన కేసీఆర్ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు
ليست هناك تعليقات:
إرسال تعليق