ఢిల్లీలో సృష్టించిన వర్ష బీభత్సం ఆనవాళ్లు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. గురు, శుక్రవారాల్లో కురిసిన భారీ వర్షానికి నగరం అతలాకుతలం అయింది. వాగులు, వంకలు ఏకమై ప్రవహించాయి. ఢిల్లీ ఎయిర్‌పోర్టులోని టెర్మినల్-1 పైకప్పు కూలి ఒకరు మృతిచెందగా, ఆయా ఘటనల్లో మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నీళ్లు ఇంకిపోవడంతో అగ్నిమాపక సిబ్బందికి అండర్‌పాస్‌లో ఇద్దరి బాలుర మృతదేహాలు దొరికాయి. వరద కారణంగా ఇద్దరు బాలురు కొట్టుకుని వచ్చి ఉంటారని భావిస్తున్నారు. ఇక ఢిల్లీలోని ఓఖ్లా అండర్‌పాస్ దగ్గర కూడా అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తి చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడిని ఎయిమ్స్ ట్రామా సెంటర్‌కు తరలించగా చనిపోయినట్లు ప్రకటించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అగ్నిమాపక సిబ్బందికి ఇద్దరు బాలుర మృతదేహాలు ఢిల్లీలోని మెట్రో స్టేషన్‌కు సమీపంలో వరద నీటిలో లభించినట్లుగా వెల్లడించారు. బాలురు స్నానం చేస్తుండగా నీటమునిగి మృతి చెంది ఉంటారని ప్రాథమికంగా అంచనా వేశారు. అండర్‌పాస్ దాదాపు 2.5-3 అడుగుల నీటితో నిండిపోయిందని పోలీసులు తెలిపారు.
డ్రైనేజీలో మూడు మృతదేహాలు లభ్యం!
السبت، 29 يونيو 2024
national New Delhi అండర్‌పాస్‌లో ఇద్దరి బాలుర మృతదేహాలు ఓఖ్లా అండర్‌పాస్ దగ్గర ఒక మృత దేహం డ్రైనేజీలో మూడు మృతదేహాలు లభ్యం
ليست هناك تعليقات:
إرسال تعليق