శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, లడ్డూ తిరుమల తిరుపతి దేవస్థానం ధరలను సవరించినట్టు పలు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని పేర్కొంది. తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, రూ.50 లడ్డూ ప్రసాదం ధరల్లో ఎలాంటి మార్పు లేదని తితిదే అధికారులు స్పష్టం చేశారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం దళారులను సంప్రదించొద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు. ''కొన్ని వాట్సప్ గ్రూప్‌లలో తిరుమల దర్శనానికి సంబంధించి అధిక ధరలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు పొంద వచ్చని.. కొంత మంది ఫోన్ నెంబర్లతో కూడిన సమాచారం సర్క్యులేట్ అవుతోంది. శ్రీవారి ప్రత్యేక దర్శనానికి సంబంధించి తితిదే వెబ్‌సైట్ ద్వారానే కాకుండా వివిధ రాష్ట్రాలకు చెందిన టూరిజం విభాగాల ద్వారా కూడా కొన్ని టికెట్ల కేటాయింపు జరిగింది. భక్తులు ఎవరైనా టూరిజం శాఖ ద్వారా కూడా టికెట్లు పొందే సౌకర్యం ఉంది. టూరిజం ద్వారా రావాలనుకునే భక్తులు.. దళారీల ద్వారా కాకుండా నేరుగా ఆయా రాష్ట్ర టూరిజం వెబ్‌సైట్‌ల ద్వారా దర్శనం ప్యాకేజీ టికెట్స్ పొందే అవకాశం ఉంది. ఈ విషయంలో భక్తులను మోసం చేస్తున్న దళారులపై విజిలెన్స్ విభాగం కఠిన చర్యలు తీసుకుంటుంది'' అని ఓ ప్రకటనలో తెలిపారు.
శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, లడ్డూ ధరల్లో ఎలాంటి మార్పు లేదు !
السبت، 22 يونيو 2024
Andhra Pradesh తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ధరల్లో ఎలాంటి మార్పు లేదు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవం
ليست هناك تعليقات:
إرسال تعليق