అంతరిక్ష కేంద్రంలో ఉన్న సునీతా విలియమ్స్‌తో సహా 8 మంది సిబ్బందికి 'స్పేస్‌ బగ్‌' రూపంలో ఇబ్బంది వచ్చిపడింది. భారత సంతతికి చెందిన ఆస్ట్రోనాట్‌ సునీతా విలియమ్స్‌ మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లారు. బోయింగ్ స్టార్‌లైనర్‌ అంతరిక్ష నౌక ద్వారా మరో వ్యోమగామి బుచ్‌ విల్మోర్‌తో సురక్షితంగా అంతరిక్ష కేంద్రంకు చేరుకున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సూపర్ బగ్‌గా పిలిచే 'ఎంటర్‌బాక్టర్ బుగాన్‌డెన్సిస్' అనే బాక్టీరియా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతరిక్ష వాతావరణంలో ఈ బ్యాక్టీరియా మరింత బలం పెంచుకుంటోందని తెలిపారు. ఇది అనేక ఔషదాలను నిరోధించగలిగే శక్తివంతమైనదని వివరించారు. ఈ బ్యాక్టీరియా మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ కావడం వల్ల దీన్ని 'సూపర్ బగ్'గా పిలుస్తారని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ఇది శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుందని తెలిపారు. ఈ స్పేస్‌ బగ్‌తో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న సునితా విలియమ్స్ సహా మిగిలిన ఎనిమిది మంది సిబ్బంది ఇబ్బందుల్లో పడనున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా అంతరిక్ష కేంద్రం.. కదిలే అంతరిక్ష శిధిలాల వల్ల ఆందోళన వ్యక్తం చేస్తుంది. అయితే ఒకరి నుంచి మరోకరి వ్యాపించే 'స్పేస్‌ బగ్‌' గత కొన్ని ఏళ్ల నుంచి అభివృద్ధి చెందటం మరింత ఆందోళన కలిగిస్తోందని శాస్త్రవేత్తలు పేర్కొటుంన్నారు. వ్యోమగాములు అంతరిక్ష యాత్రల సమయంలో ఆరోగ్యపరంగా సవాళ్లను ఎదుర్కొంటారని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఆస్ట్రోనాట్స్‌ ఆరోగ్యం కోసం 'స్పేస్‌ బగ్‌' ప్రభావాన్ని, ప్రతికూలతలను అంతరిక్ష కేంద్రం త్వరగా అంచనా వేయటం కీలమని పేర్కొంటున్నారు. సునీతా విలియమ్స్‌తో పాటు మరో ఆస్ట్రోనాట్‌ బారీ యూజీన్ బుచ్‌ విల్మోర్‌ జూన్ 6, 2024 న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సునిత డ్యాన్స్ చేసి తన ఆనందాన్ని కూడా వ్యక్తం చేశారు. అయితే వారు వారం రోజులు పాటు అంతరిక్ష కేంద్రంలో ఉండి అనంతరం భూమిపైకి తిరిగి వస్తారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ