దేశీయ మార్కెట్లోకి గూగుల్ 'జెమిని' యాప్‌ను ప్రవేశపెట్టింది. ఇంగ్లీష్ తో పాటు తెలుగు, హిందీ సహా తొమ్మిది భారతీయ భాషల్లో ఇది అందుబాటులో ఉంటుందని వివరించింది. ఐఫోన్ యూజర్ల కోసం గూగుల్ యాప్ ద్వారా మరికొన్ని వారాల్లో జెమిని యాప్‌ను ప్రవేశపెడతామని పేర్కొంది. భారత్‌లో విద్యార్థుల నుంచి డెవలపర్ల వరకు వివిధ వర్గాల వారు ఉత్పాదకతను పెంచుకునేందుకు, కొత్త విషయాలు నేర్చుకునేందుకు, సృజనాత్మకతను మెరుగుపర్చుకునేందుకు దీన్ని ఉపయోగించుకుంటున్నారని జెమిని ఎక్స్‌పీరియన్సెస్ వైస్ ప్రెసిడెంట్ అమర్ సుబ్రమణ్య ఒక బ్లాగ్ పోస్ట్‌లో తెలిపారు. తాజాగా గూగుల్‌కి చెందిన లేటెస్ట్ ఏఐ మోడల్ జెమిని 1.5 ప్రో ఫీచర్లు కూడా భారత్‌లోని యూజర్లకు అందుబాటులో ఉంటాయని వివరించారు.
దేశీయ మార్కెట్లోకి గూగుల్ 'జెమిని' యాప్ ప్రవేశం !
الأربعاء، 19 يونيو 2024
science technology ఇంగ్లీష్ తో పాటు తెలుగు ఐఫోన్ యూజర్ల కోసం గూగుల్ యాప్ ద్వారా మరికొన్ని వారాల్లో జెమిని యాప్‌ను దేశీయ మార్కెట్లోకి గూగుల్ 'జెమిని' యాప్ ప్రవేశం హిందీ సహా తొమ్మిది భారతీయ భాషల్లో
ليست هناك تعليقات:
إرسال تعليق