24 ఏళ్ల క్రితం ఎర్రకోటపై జరిగిన దాడి కేసులో దోషిగా తేలిన పాకిస్థాన్ ఉగ్రవాది మహ్మద్ ఆరిఫ్ అలియాస్ అష్ఫాక్ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతిరస్కరించినట్లు అధికారులు బుధవారం తెలిపారు. రాష్ట్రపతి పదవి చేపట్టిన అనంతరం ఆమె తిరస్కరించిన రెండో క్షమాభిక్ష పిటిషన్ ఇది. 2022 నవంబర్ 3న ఆరిఫ్ రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేస్తూ ఈ కేసులో అతనికి విధించిన మరణశిక్షను ధృవీకరించింది. అయితే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం సుదీర్ఘ జాప్యం కారణంగా మరణశిక్ష అనుభవిస్తున్న దోషి తన శిక్షను మార్చాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరవచ్చు. ఇందులోభాగంగా మే 15న ఆరిఫ్ క్షమాభిక్ష పిటిషన్‌ వేశాడని, దానిని మే 27న రాష్ట్రపతి తిరస్కరించారని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఎర్రకోటపై దాడి దేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమాధికారానికి ముప్పు కలిగిస్తుందని సుప్రీం వ్యాఖ్యానించింది. ఆరిఫ్‌కు అనుకూలంగా ఎటువంటి ఉపశమనాన్ని కలిగించే పరిస్థితులు లేవని పేర్కొంది. 2000 డిసెంబరు 22న ఎర్రకోట ప్రాంగణంలో ఉన్న 7 రాజ్‌పుతానా రైఫిల్స్ యూనిట్‌పై చొరబాటుదారులు కాల్పులు జరిపారు. ఫలితంగా ముగ్గురు ఆర్మీ సిబ్బంది మరణించారు. నిషేధిత లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) సభ్యుడు ఆరిఫ్‌ను దాడి జరిగిన నాలుగు రోజుల తర్వాత దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. 2005 అక్టోబరులో ట్రయల్ కోర్టు అతనికి మరణశిక్ష విధించడంతో, దాడి చేసేందుకు ఇతర ఉగ్రవాదులతో కలిసి కుట్ర పన్నినట్లు ఆరిఫ్ ఒప్పుకున్నాడు. 1999లో మరో ముగ్గురు ఎల్‌టీటీ తీవ్రవాదులతో కలిసి అక్రమంగా దేశంలోకి ప్రవేశించామన్నాడు. ఎర్రకోటపై దాడి చేసేందుకు శ్రీనగర్‌లోని ఓ ఇంట్లో కుట్ర పన్నినట్లుగా తెలిపాడు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ