జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా స్వతంత్య్ర అభ్యర్థి అబ్దుల్ రషీద్ షేక్ చేతిలో ఓటమి చవి చూశారు. నార్త్ కశ్మీర్‌లో విక్టరీ కొట్టిన రషీద్‌కు ఒమర్ కంగ్రాట్స్ తెలిపారు. తన ఎక్స్ అకౌంట్‌లో ఓటమిని అంగీకరిస్తున్నట్లు ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. ఓటర్లు తమ మనోగతాన్ని వెల్లడించారని, అదే కీలకమని ఆయన అన్నారు. అబ్దుల్ రషీద్‌కు 350858 ఓట్లు పోలయ్యాయి. ఒమర్ అబ్ధుల్లాకు 191124 ఓట్లు పడ్డాయి. దీంతో 1,59,734 ఓట్ల తేడాతో ఒమర్ ఓటమి పాలయ్యారు. 57 ఏళ్ల రషీద్ అయిదేళ్ల పాటు తీహార్ జైలులో ఉన్నారు. యూఏపీఏ చట్టం కింద గతంలో అతన్ని అరెస్టు చేశారు. స్వతంత్య్ర అభ్యర్థిగా ఈసారి ఆయన పోటీ చేశారు.
ఒమర్ అబ్దుల్లా ఓటమి !
الثلاثاء، 4 يونيو 2024
J&K national అదే కీలకమని ఒమర్ అబ్దుల్లా ఓటమి ఓటర్లు తమ మనోగతాన్ని వెల్లడించారని బారాముల్లా నియోజకవర్గం నుంచి స్వతంత్య్ర అభ్యర్థి అబ్దుల్ రషీద్ షేక్ చేతిలో
ليست هناك تعليقات:
إرسال تعليق