ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని సహస్రతల్లో హిమాలయాల్లో ట్రెక్కింగ్ కు వెళ్లి ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన చోటుచేసుకుంది. రెవెన్యూ డిపార్ట్ మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ రష్మీ మహేష్ వివరాల మేరకు కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన మొత్తం 22 మంది యాత్రికులు జూన్ 4 న ఉదయం సహస్రతల్ లో ఆల్ పైన్ సరస్సు ఎగువ హిమాలయ ప్రాంతంలో ట్రెక్కింగ్ కు వెళ్లారు. అయితే, అలా వెళ్లిన వారు జూన్ 7న తిరిగి బేస్ క్యాంప్ కు చేరుకోవాల్సి ఉండగా దారి తప్పారు. అక్కడ నెలకొన్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఆ 22 మందిలో కర్ణాటకకు చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోగా మరో నలుగురు గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న స్థానికులు మంగళవారం సాయంత్రం 4.30కి ట్రెక్కింగ్ అసోసియేషన్ విపత్తు నిర్వహణ శాఖ అధికారులకు సమాచారం అందజేశారు. దీంతో రంగంలోకి దిగిన సిబ్బంది ట్రెక్కర్స్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. వారికి తోడుగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక హెలికాప్టర్తో రంగంలోకి దిగి మొత్తం 13 మందిని కాపాడింది. కాగా, ఈ దర్ఘటనలో మరణించిన వారి వివరాలు ఇంకా తెలియరాలేదు.
ట్రెక్కింగ్ కు వెళ్లి ఐదుగురు మృతి ?
الأربعاء، 5 يونيو 2024
7న తిరిగి బేస్ క్యాంప్ కు చేరుకోవాల్సి ఉండగా దారి తప్పారు national uttarakhandh ట్రెక్కింగ్ కు వెళ్లి ఐదుగురు మృతి ? మరో నలుగురు గల్లంతు హిమాలయాల్లో ట్రెక్కింగ్ కు వెళ్లి
ليست هناك تعليقات:
إرسال تعليق