వాట్సాప్ కాలింగ్‌ ఇంటర్‌ఫేస్‌లో మరోసారి మార్పులు ?


వాట్సాప్ కాలింగ్‌ ఇంటర్‌ఫేస్‌లో మరోసారి మార్పులు చేయనుంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ బీటా వెర్షన్‌లో ఈ కొత్త అప్‌డేట్‌ అందుబాటులో ఉంది. గతంలో కాలింగ్ సమయంలో బ్యాక్‌ బటన్‌ స్థానంలో మినిమైజ్‌ బటన్‌ను తీసుకొచ్చారు. కిందనున్న కాలింగ్ బార్‌లో మార్పులు చేశారు. ఈ అప్‌డేట్‌ ప్రస్తుతం కొంత మంది బీటా టెస్టర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్‌ బీటా 2.24.12.14 వెర్షన్‌ ఈ అప్‌డేట్‌ను పొందవచ్చు. వాట్సాప్‌ ఫీచర్‌ ట్రాకర్‌ Wabetainfo ఇందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను షేర్‌ చేసింది. దీని ఆధారంగా వాట్సాప్‌ కాలింగ్‌ బార్‌లో కింద భాగంలో కొన్ని మార్పులు చేశారు. గతం కంటే ప్రొఫైల్‌ ఫోటో పెద్దగా కనిపించనుంది. ప్రస్తుతం కొంత మంది బీటా టెస్టర్‌లకే ఈ అప్‌డేట్‌ అందుబాటులో ఉండగా.. త్వరలో మరింత మందికి అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. వాట్సాప్‌ లో ఇమాజిన్ పేరుతో మరో ఫీచర్‌ను టెస్టింగ్ చేస్తోంది. మెటా LLM మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ ఫీచర్‌ ద్వారా టెక్స్ట్ నుంచి ఫోటోలను తయారు చేసేందుకు యూజర్లకు అవకాశం కల్పిస్తుంది. వాట్సాప్‌ ఫీచర్‌ ట్రాకర్ Wabetainfo ప్రకారం ఆండ్రాయిడ్‌ వెర్షన్‌ 2.24.12.4 అందుబాటులో ఉంది. AI ద్వారా ఈ ఫోటోలను రూపొందించవచ్చు. ఇటీవల స్టేటస్‌ అప్‌డేట్‌లో అనేక మార్పులు చేసేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇటీవల స్టేటస్‌లో నిమిషం పాటు వీడియో పోస్టు చేసే విధంగా కొత్త అప్‌డేట్‌ పైన పనిచేస్తున్నట్లు తెలిపింది. దీంతోపాటు వాయిస్‌ నోట్స్‌ పైన పనిచేస్తుందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలను వాట్సాప్‌ ఫీచర్‌ ట్రాకర్‌ వెల్లడించింది.

Post a Comment

0 Comments