ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో సోమవారం మధ్యాహ్నం టాలీవుడ్ నిర్మాతలు విజయవాడ లోని క్యాంప్ ఆఫీసులో సమావేశం కానున్నారు. టాలీవుడ్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకునేందుకు సహకరించాలని డిప్యూటీ సీఎంని నిర్మాతలు కోరనున్నట్లు తెలుస్తోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక వారు డిప్యూటీ సీఎంని కలుస్తుండడం ఇదే తొలిసారి. సినిమా టిక్కెట్ల ధరలతో పాటు థియేటర్ల సమస్యలు వంటివి పవన్ కళ్యాణ్ తో చర్చించే అవకాశాలు ఉన్నాయి అని తెలుస్తోంది. పవన్ ను హారిక హాసిని చినబాబు, అశ్వినీ దత్ తో పాటు మైత్రి మూవీ మేకర్స్ నవీన్, రవిశంకర్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నాగవంశీ, పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్, వివేక్, దామోదర్ ప్రసాద్, బోగవల్లి ప్రసాద్,డీవీవీ దానయ్య ,తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షడు దిల్ రాజు కలవనున్నారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో టాలీవుడ్ నిర్మాతల భేటీ !
الأحد، 23 يونيو 2024
Andhra Pradesh అశ్వినీ దత్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో టాలీవుడ్ నిర్మాతల భేటీ దానయ్య దామోదర్ ప్రసాద్ దిల్ రాజు నవీన్ నాగవంశీ రవిశంకర్ వివేక్ విశ్వప్రసాద్ హారిక హాసిని చినబాబు
ليست هناك تعليقات:
إرسال تعليق