కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి ఆ పార్టీ నేతల బుజ్జగింపులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ తదితరులు ఆయనతో మాట్లాడారు. గత మూడు రోజులుగా జీవన్‌రెడ్డి అలకబూనడంతో బుజ్జగించే కార్యక్రమం సాగింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు రాజ్‌ఠాకూర్, ప్రేమ్‌సాగర్‌రావు తదితరులు బుజ్జగించారు. అయినా, జీవన్‌రెడ్డి మెట్టు దిగలేదు. తన ప్రమేయం లేకుండా జరగాల్సింది జరిగిపోయిందని జీవన్‌రెడ్డి అందోళన వ్యక్తం చేశారు. పార్టీని వీడేది లేదని స్పష్టం చేస్తున్నప్పటికీ ఇవాళ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయనున్నట్టు వెల్లడించారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పార్టీ అధిష్టానం, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ జీవన్‌రెడ్డికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. బుధవారం ఉదయం ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రి ఉత్తమ్ దిల్లీ వెళ్లారు. ఆ వెంటనే భట్టి శ్రీధర్‌బాబుతో మాట్లాడిన తర్వాత జీవన్‌రెడ్డిని ఢిల్లీకి రావాల్సిందిగా ఆహ్వానించారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ జీవన్‌రెడ్డిని వెంటబెట్టుకుని ఢిల్లీ వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ, మంత్రులు పొంగులేటి, సీతక్క, కోమటిరెడ్డి, జూపల్లి తదితరులు దిల్లీలోనే ఉన్నారు. రేవంత్ రెడ్డి , దీపాదాస్ మున్షీలతో సమావేశమైన తర్వాత సాయంత్రం జీవన్‌రెడ్డిని కాంగ్రెస్ పెద్దలతో కూడా కలిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 40 సంవత్సరాలుగా కాంగ్రెస్‌లో ఉన్న సీనియర్ నేత అలకబూనడం పార్టీ శ్రేణుల్లో తప్పుడు సంకేతాలు వెళ్లకుండా నిలువరించేందుకు అధిష్టానం నష్ట నివారణ చర్యలు చేపట్టినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపు ?
الأربعاء، 26 يونيو 2024
telangana ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపు ? గత మూడు రోజులుగా జీవన్‌రెడ్డి అలకబూనడంతో బుజ్జగించే కార్యక్రమం సాగింది జీవన్‌రెడ్డి మెట్టు దిగలేదు
ليست هناك تعليقات:
إرسال تعليق