ఫిల్మ్‌సిటీలో రామోజీరావు పార్థివదేహం !


నాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివదేహాన్ని రామోజీ ఫిల్మ్‌సిటీకి తరలించారు. ఆయనకు నివాళులు అర్పించేందుకు పెద్ద సంఖ్యలో సినీ, రాజకీయ ప్రముఖులు తరలివస్తున్నారు. తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఏపీ మాజీ మంత్రి పరిటాల సునీత, సినీ ప్రముఖులు రాజమౌళి, రాఘవేంద్రరావు, కీరవాణి, రాజేంద్రప్రసాద్‌, ఫైట్‌ మాస్టర్లు రామ్‌లక్ష్మణ్‌, బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ తదితరులు నివాళులర్పించారు. రామోజీరావు పార్థివదేహాన్ని చూసి రాజేంద్రప్రసాద్‌ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. రామోజీ గ్రూప్‌ సంస్థల సిబ్బంది తమ ఛైర్మన్‌కు కడసారి నివాళులు అర్పిస్తున్నారు.

Post a Comment

0 Comments