ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 12వ తేదీన ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే మరోవైపు వేసవి సెలవుల అనంతరం రాష్ట్రంలోని పాఠశాలలు అదే రోజు పునఃప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాలలను ఈనెల 12కు బదులు 13న తెరవాలని టీడీపీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్‌కు వినతి పత్రం అందజేశారు. పాఠశాలల పునః ప్రారంభ తేదీని వాయిదా వేయాలని టీడీపీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ అందులో కోరారు. ఈ నెల 12న సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేస్తుండడంతో వాయిదా వేయాలని వినతి చేశారు. దీంతో ఏపీలో స్కూల్స్ రీ ఓపన్ తేదీ వాయిదాపడే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో స్కూల్స్ రీ ఓపెన్ తేదీలో స్వల్ప మార్పు ?
الخميس، 6 يونيو 2024
12వ తేదీన ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం Andhra Pradesh ఆంధ్రప్రదేశ్‌లో స్కూల్స్ రీ ఓపెన్ తేదీలో స్వల్ప మార్పు ? పునః ప్రారంభ తేదీని వాయిదా వేయాలని వినతి
ليست هناك تعليقات:
إرسال تعليق