బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన నేపథ్యంలో సోమవారం భారత షేర్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. నిఫ్టీ 50 3.58% జంప్ చేసింది. సెన్సెక్స్ 3.55% లాభపడింది. ఫిబ్రవరి నుండి అత్యుత్తమ ఇంట్రాడే లాభాలతో ఆల్-టైమ్ గరిష్టాలను తాకింది. అన్ని ప్రధాన రంగాల స్టాక్స్ పెరిగాయి. స్మాల్, మిడ్ క్యాప్‌లు కూడా గణనీయమైన లాభాలను చూశాయి. పాలక పక్షానికి మూడింట రెండు వంతుల మెజారిటీ వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ సూచించాయి. దీంతో స్టాక్ మార్కెట్ దూసుకుపోతోంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల విశ్వసనీయత పై మిశ్రమ స్పందన ఉన్నా.. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ పాజిటివ్ గా రెస్పాండ్ అవడం విశేషం.
దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్ సూచీలు !
الاثنين، 3 يونيو 2024
business national stock market దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్ సూచీలు బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా నేపథ్యంలో
ليست هناك تعليقات:
إرسال تعليق