గత సంవత్సరం గూగుల్ పిక్సల్ 7a స్మార్ట్ ఫోన్ విడుదల అయింది. విడుదల సమయంలో ఈ హ్యాండ్ సెట్ ధర రూ.43999 గా ఉంది. ప్రస్తుతం జరుగుతున్న ఫ్లిప్ కార్ట్ మెగా జూన్ బోనంజా సేల్ లో భాగంగా రూ.35,000 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్ సెట్ అనేక మెరుగైన స్పెసిఫికేషన్ లు, ఫీచర్‌లను కలిగి ఉంది. ఈ సంవత్సరం పిక్సల్ 8 ఫోన్‌లు విడుదల అయ్యాయి.గూగుల్ పిక్సల్ 7a స్మార్ట్ ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ లో రూ.34,999 గా ఉంది. ఐసీఐసీఐ బ్యాంకు కార్డులు సహా పాత ఫోన్‌లను ఎక్స్చేంజీ చేయడం ద్వారా మరింత డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ICICI బ్యాంకు కార్డుల ద్వారా రూ.1000 తగ్గింపును పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంకు కార్డు ద్వారా 5 శాతం తగ్గింపును పొందవచ్చు. గూగుల్ పిక్సల్ 7a స్మార్ట్ ఫోన్ 6.1 అంగుళాల పుల్ HD + డిస్‌ప్లేను కలిగి ఉంది. 90Hz రీఫ్రెష్ రేట్ తో వచ్చింది. ఈ హ్యాండ్ సెట్ డిస్‌ప్లే గొరెల్లా గ్లాస్ 3 రక్షణను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత OS పైన పనిచేస్తుంది.ఈ పిక్సల్ 7a స్మార్ట్ ఫోన్ టెన్సార్ G2 చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. దీంతోపాటు టైటాన్ M2 సెక్యూరిటీ కో ప్రోసెసర్‌ను కూడా కలిగి ఉంటుంది. ఫలితంగా మెరుగైన పనితీరును కనబరుస్తుంది. దీంతోపాటు 18W వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 4300mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.ఈ స్మార్ట్ ఫోన్ వెనుకవైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. OIS సపోర్టుతో 64MP ప్రధాన కెమెరా, మరియు 13MP అల్ట్రా వైడ్ కెమెరాను అమర్చారు. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 13MP కెమెరాను కలిగి ఉంటుంది.IP67 రేటింగ్ తో వాటర్, డస్ట్ రెసిస్టెంట్ గా వస్తుంది. కనెక్టివిటీ పరంగా బ్లూటూత్ 5.3, వైఫై 6, NFC, USB -C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంటుంది.
ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్ పిక్సల్ 7a స్మార్ట్‌ఫోన్‌పై డిస్కౌంట్ ఆఫర్ !
السبت، 15 يونيو 2024
18W వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 4300mAh బ్యాటరీ google pixl smart phone టైటాన్ M2 సెక్యూరిటీ కో ప్రోసెసర్ ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్ పిక్సల్ 7a స్మార్ట్‌ఫోన్‌పై డిస్కౌంట్ ఆఫర్
ليست هناك تعليقات:
إرسال تعليق