పీఎం కిసాన్ ట్రాక్టర్ స్కీమ్ కింద ట్రాక్టర్లను కొంటే వ్యవసాయ మంత్రిత్వ శాఖ రైతులకు సబ్సిడీ ఇస్తోందని పీఎం కిసాన్ ట్రాక్టర్ స్కీమ్ పేరుతో ఉన్న వెబ్‌సైట్ చెబుతోంది. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవడానికి ఆన్‌లైన్ ప్రక్రియ ఉంది అంటూ కొంత సమాచారం ఇస్తోంది. అలాగే ఈ పథకం కోసం అవసరమైన డాక్యుమెంట్లు, అర్హతలు ఇవీ అంటూ వివరాలు ఇస్తోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం అధికారికంగా స్పందించింది. తాము ఇలాంటి పథకం ఏదీ ఇవ్వట్లేదని తెలిపింది. రైతులు ఆ మోసపూరిత ప్రకటన చూసి ఉచ్చులో పడొద్దని తెలిపింది. రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరింది. రైతులు తమ వ్యక్తిగత వివరాల్ని ఆ మోసపూరిత వెబ్‌సైట్‌లో ఇవ్వొద్దని కోరుతోంది. కేంద్రం అధికారికంగా ఇచ్చిన ప్రకటనను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ద్వారా తెలుసుకోవచ్చు. ప్రభుత్వ మీడియా వెబ్‌సైట్ పిఐబిలో ఉండే ఫ్యాక్ట్‌చెక్ బృందం, ట్విట్టర్ (ఎక్స్)లో ఈ పథకంపై స్పష్టత ఇచ్చింది. ఇలాంటి పథకాలేవీ ప్రభుత్వం అమలు చేయడం లేదని తెలిపింది. పీఎం కిసాన్ ట్రాక్టర్ యోజన వెబ్‌సైట్ ఫేక్ అని స్పష్టం చేసింది. ఈ వెబ్ సైట్ మోసపూరితమైనదనీ, దీన్ని నమ్మొద్దని చెప్పింది. ఇలాంటి పథకాన్ని వ్యవసాయ మంత్రిత్వ శాఖ నిర్వహించడం లేదని స్పష్టం చేసింది.
ట్రాక్టర్ కొంటే 50 శాతం సబ్సిడీ పేరిట ఆన్‌లైన్ మోసం ?
الاثنين، 17 يونيو 2024
national ఇలాంటి పథకం ఏదీ ఇవ్వట్లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది ట్రాక్టర్ కొంటే 50 శాతం సబ్సిడీ పేరిట ఆన్‌లైన్ మోసం ? రైతులు అప్రమత్తంగా ఉండాలని
ليست هناك تعليقات:
إرسال تعليق