నీట్ యూజీ-2024 పరీక్ష పత్రం లీకేజీ, పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో గ్రేస్ మార్కులు పొందిన 1,563 మంది విద్యార్థులకు తిరిగి ఆదివారం నీట్ పరీక్ష నిర్వహించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నీట్ యూజీ -2024 రీటెస్ట్ నిర్వహించింది. వారిలో 48 శాతం మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారని ఎన్టీఏ తెలిపింది. 1563 మంది విద్యార్థుల్లో 813 మంది (52 శాతం) పరీక్షకు హాజరైతే, 750 మంది (48 శాతం) గైర్హాజరయ్యారని ఎన్టీఏ ఓ ప్రకటనలో తెలిపింది. ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హర్యానా, మేఘాలయ రాష్ట్రాలతోపాటు చండీగఢ్ కేంద్ర పాలిత ప్రాంతం పరిధిలో ఏడు పరీక్షా కేంద్రాల్లో వీరికి పరీక్ష పున:నిర్వహించింది. చండీగఢ్ నుంచి ఇద్దరు రాయాల్సి ఉన్నా గైర్హాజరయ్యారు. ఛత్తీస్ గఢ్‌లో 602 మంది విద్యార్థులు రాయాల్సి ఉండగా 311 మంది గైర్హాజరయ్యారు. మరో 291 మంది పరీక్ష రాశారు. హర్యానాలో 494 మందికి 287 మంది, మేఘాలయలో 466 మందికి 234 మంది విద్యార్థులు పరీక్ష రాశారు.
నీట్ రీటెస్ట్‌కు 48 శాతం మంది గైర్హాజరు !
الأحد، 23 يونيو 2024
1563 మంది విద్యార్థుల్లో 813 మంది పరీక్షకు హాజరు national నీట్ యూజీ-2024 నీట్ రీటెస్ట్‌కు 48 శాతం మంది గైర్హాజరు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ
ليست هناك تعليقات:
إرسال تعليق