పునరుత్పాదక ఇంధన లక్ష్యాన్ని చేరుకోవడానికి రూ.32 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది !


2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన లక్ష్యాన్ని చేరుకోవడానికి 385 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.31.95 లక్షల కోట్లు) భారత్‌ పెట్టుబడి పెట్టవలసి ఉంటుందని ప్రముఖ అంతర్జాతీయ సంస్థ మూడీస్‌ రేటింగ్స్‌ గురువారం తెలిపింది. అయితే, రాబోయే దశాబ్దం వరకు బొగ్గు, విద్యుత్‌ ఉత్పత్తికి కీలక వనరుగా ఉంటుందని మూడీస్‌ పేర్కొంది. భారత్‌ తన 500 GW లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రతి సంవత్సరం 50 GW శిలాజయేతర ఇంధన సామర్థ్యాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. అయితే దాదాపు 44 GW వార్షిక సామర్థ్య లక్ష్యాన్ని భారత్‌ సాధిస్తుందని మూడీస్‌ అంచనా వేసింది. పునరుత్పాదక శక్తిలో స్థిరమైన వృద్ధి ఉన్నప్పటికీ, వీటిలో ఎక్కువ భాగం సౌరశక్తిగా ఉండొచ్చు. దేశంలో పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తిలో ప్రైవేట్‌ సంస్థలు కీలకపాత్ర పోషించనున్నాయి. ముఖ్యంగా, అదానీ గ్రూప్‌ ద్వారా అదానీ గ్రీన్‌ ఎనర్జీ.. 2030 నాటికి 45 GW పునరుత్పాదక విద్యుత్‌ శక్తిని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Post a Comment

0 Comments