జూన్ 25న రెడ్ మీ నోట్ 13 ప్రో కొత్త స్కార్లెట్ రెడ్ కలర్ వేరియంట్ విడుదల !


రెడ్ మీ నోట్ 13 ప్రో 5జి స్కార్లెట్ రెడ్ వేరియంట్ ను జూన్ 25 వ తేదీన లాంచ్ చేస్తుంది. ఈ కొత్త కలర్ వేరియంట్ ను చాలా అందమైన రెడ్ అండ్ బ్లాక్ లుక్ లో తీసుకు వస్తోంది రెడ్ మీ. ఈ ఫోన్ ప్రైస్ మరియు ఫీచర్స్ పరంగా పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ఈ ఫోన్ 2024 జనవరి లో దేశీయ మార్కెట్లో విడుదల చేయబడింది. ఇప్పుడు కొత్త కలర్ వేరియంట్ లో కూడా వస్తోంది. రెడ్ మీ నోట్ 13 ప్రో స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం రూ. 24,999 రూపాయల ప్రారంభ ధరలో లభిస్తోంది. ఈ ఫోన్ మూడు వేరియంట్లలో లభిస్తుంది మరియు పైన తెలిపిన ధర (8GB + 128GB) బేసిక్ వేరియంట్ ధర. ఈ ఫోన్ మరో రెండు స్టోరేజ్ వేరియంట్లలో కూడా లభిస్తుంది. రెడ్ మీ ఈ ఫోన్ ను 200MP ట్రిపుల్ రియర్ కెమెరాతో తో అందించింది. ఈ ఫోన్ కొత్త స్నాప్ డ్రాగన్ 7s జెన్ 2 చిప్ సెట్ తో నడుస్తుంది మరియు 8GB/12GB ర్యామ్ మరియు 128GB/256GB స్టోరేజ్ ఆప్షన్ లతో వస్తుంది. ఈ ఫోన్ లో 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 1.5K రిజల్యూషన్ కలిగిన 6.7 ఇంచ్ AMOLED స్క్రీన్ ఉంది. ఈ ఫోన్ స్క్రీన్ గొరిల్లా గ్లాస్ విక్టస్ గ్లాస్ రక్షణలో ఉంటుంది మరియు Dolby Vision సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ లో వెనుక 200MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ మరియు 2MP మ్యాక్రో కెమెరా లతో ఉంటుంది. ఈ ఫోన్ లో ముందు 16MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఈ ఫోన్ లో 67W టర్బో ఛార్జ్ సూపర్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5100mAh బిగ్ బ్యాటరీ కూడా వుంది.

Post a Comment

0 Comments