ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల వద్ద హైదరాబాదు నుండి కామాక్షి ట్రావెల్ బస్సు చిలకలూరిపేట మీదుగా కందుకూరు వెళ్లే క్రమంలో లింగంగుంట్ల వద్ద ఓవర్ స్పీడ్ తో కారును తప్పించబోయి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. కరెంటు స్తంభాన్ని ఢీకొట్టడంతో పల్టీ కొట్టింది. ఇందులో సుమారుగా 40 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 20 మందికి స్వల్ప గాయాలు , ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. వీరందరినీ ,108 అంబులెన్సుల ద్వారా చిలకలూరిపేట, నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
0 Comments