ఆంధ్రప్రదేశ్‌ అప్పులు రూ.14 లక్షల కోట్లు ?


ఆంధ్రప్రదేశ్ తొలి మంత్రివర్గ సమావేశం రేపు ఉదయం 10 గంటలకు జరుగనుంది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రాధాన్యతలపై సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేయనున్నారు. హామీల అమలు, రాజధాని, పోలవరం నిర్మాణాలపై కీలక చర్చ జరుగనుంది. ఎనిమిది శాఖలపై శ్వేతపత్రాల విడుదలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆర్థిక పరిస్థితిపై ప్రత్యేకంగా చర్చించనుంది చంద్రబాబు నాయుడు మంత్రివర్గం. ఏపీకి రూ.14 లక్షల కోట్లకు పైగా అప్పుల భారం ఉందని ఇప్పటికే ప్రభుత్వానికి చేరిందట సమాచారం. గత ప్రభుత్వంలోని అవినీతిపై విచారణ చేపట్టే అంశంపై ఏపీ కేబినెట్ భేటీలో కీలక ప్రస్తావన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. నిజంగానే ఏపీకి రూ.14 లక్షల కోట్ల కు పైగా అప్పుల భారం ఉంటే… చంద్రబాబు ప్రభుత్వం ఎలా ఎదుర్కొబోతుందో చూడాలి.

Post a Comment

0 Comments