యాపిల్ వార్షిక డెవలపర్స్ కాన్ఫరెన్స్‌కు హాజరైన పలువురు వ్యక్తులు సోషల్ మీడియాలో చిత్రాలు, వీడియోలను పంచుకున్నారు. భారతీయ సంతతికి చెందిన 13 ఏళ్ల బాలుడు శౌర్య గుప్తా కూడా ఈ వార్షిక ఈవెంట్‌కు హాజరయ్యాడు. ఇందులోభాగంగా యాపిల్ సీఈఓ టిమ్ కుక్‌ను కలిసిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేశాడు. టిమ్ కుక్‌ను కలవాలనుకున్న తన కోరిక నెరవేరడంతో మిషన్ కంప్లీటెడ్ అంటూ వ్యాఖ్యను జత చేశాడు. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు టిమ్ కుక్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ చాలా మంచి చిత్రం ఆ అబ్బాయి ఈ రోజును ఎప్పటికీ మరిచిపోలేడు అని వ్యాఖ్యానించారు. మరో నెటిజన్ స్పందిస్తూ టిమ్ కుక్ చాలా మంచి వారిలా ఉన్నారంటూ పోస్టు చేశారు. ఐదు రోజుల పాటు నిర్వహించిన ఈ కాన్ఫరెన్స్‌లో యాపిల్ దాని iOS 18, యాపిల్ ఇంటెలిజెన్స్, AI సహా వివిధ పరికరాల్లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను వెల్లడించారు. కంపెనీ ప్రదర్శనలో ఆపిల్ ఇంటెలిజెన్స్ అనే కొత్త AI ప్లాట్‌ఫారమ్ వ్యాపారులను ఆకర్షించింది. ఒకప్పుడు కంపెనీ అగ్రగామి అయిన డిజిటల్ అసిస్టెంట్ సిరి అప్‌డేటెడ్ వెర్షన్‌ను కూడా ప్రదర్శించారు. ఈ ఏడాది నిర్వహించిన స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్‌లో తాను గెలుపొందినందుకు ఈ సమ్మిట్‌లో పాల్గొనే అవకాశం వచ్చిందని శౌర్య గుప్తా తెలిపాడు. స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్ అనేది ప్రతీ సంవత్సరం విద్యార్థుల కోసం నిర్వహించే ఒక ఛాలెంజ్ పరీక్ష అని దీనిలో అప్లికేషన్ రూపొందించాల్సి ఉంటుందని వివరించాడు.
టిమ్ కుక్‌తో 13 ఏళ్ల శౌర్య గుప్తా పోస్ట్ వైరల్ !
الأربعاء، 12 يونيو 2024
apple science technology టిమ్ కుక్‌తో 13 ఏళ్ల శౌర్య గుప్తా పోస్ట్ వైరల్ తన కోరిక నెరవేరడంతో మిషన్ కంప్లీటెడ్ అంటూ వ్యాఖ్యను జత చేశాడు యాపిల్ వార్షిక డెవలపర్స్ కాన్ఫరెన్స్
ليست هناك تعليقات:
إرسال تعليق