ప్రజ్వల్ ఎక్కడ ఉన్నా వెంటనే భారత్‌కు వచ్చి పోలీసులకు లొంగి పోవాలన్నారు. లేకపోతే తన ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని మాజీ ప్రధాని దేవెగౌడ తీవ్రంగా హెచ్చరించారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్'లో ఓ లేఖ విడుదల చేశారు. ''ప్రజ్వల్ రేవణ్ణ ఎక్కడ ఉన్నా వెంటనే ఇండియాకు తిరిగి రావాలి. పోలీసులకు లొంగిపోయి న్యాయ ప్రక్రియను ఎదుర్కొవాలి. ఇది విజ్ఞప్తి చేయటం కాదు. హెచ్చరిక జారీ చేస్తున్నా. ప్రజ్వల్ నా హెచ్చరికను లెక్క చేయకపోతే.. నా ఆగ్రహానికి, కుటుంబ సభ్యులు కోపానికి గురికావాల్సి వస్తుంది. ప్రజ్వల్‌పై వచ్చిన ఆరోపణలను చట్టం చూసుకుంటుంది. కానీ కుటుంబం చెప్పిన మాట వినకపోతే ఒంటరిగా మిగిలిపోయేలా చేస్తుంది. నాపైన అతనికి గౌరవం ఉంటే వెంటనే భారత్‌కు తిరిగి రావాలి'' అని దేవెగౌడ తాను విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.
ప్రజ్వల్ ఎక్కడ ఉన్నా వెంటనే వచ్చి పోలీసులకు లొంగి పోవాలి !
الخميس، 23 مايو 2024
'ఎక్స్'లో లేఖ విడుదల karnataka ప్రజ్వల్ ఎక్కడ ఉన్నా వెంటనే వచ్చి పోలీసులకు లొంగి పోవాలి లేకపోతే తన ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని మాజీ ప్రధాని దేవెగౌడ హెచ్చరిక
ليست هناك تعليقات:
إرسال تعليق