రియల్ ఎస్టేట్లో భారీగా మోసాలు జరుగుతున్నాయని అభిమానులు, సామాన్య ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నటుడు జగపతి బాబు సూచించారు. భూమి కొనేముందు రెరా నిబంధనలు గుర్తించి పూర్తిగా తెలుసుకొని ప్రాపర్టీ కొనాలన్నారు. తనను రియల్ ఎస్టేట్ వ్యాపారులు మోసం చేశారని వాపోయారు. ఇటీవల ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి చెందిన యాడ్ లో నటించా అని చెప్పారు. చెక్కు విషయంలో వాళ్లు మోసం చేశారని తెలిపారు. తనను మోసగించిన వాళ్లు ఎవరు, అసలు ఏం జరిగింది వంటి విషయాలను త్వరలోనే బయటపెడతా అన్నారు. రియల్ ఎస్టేట్ గురించి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కూడా హెచ్చరించారని జగపతి బాబు గుర్తు చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారులు మోసం చేశారు !
الأربعاء، 29 مايو 2024
andhrapradesh cinema telangana అభిమానులు నటుడు జగపతి బాబు రియల్ ఎస్టేట్ వ్యాపారులు మోసం చేశారు సామాన్య ప్రజలు జాగ్రత్తగా ఉండాలని
ليست هناك تعليقات:
إرسال تعليق