పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో ఒక బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ సంఘటనలో ఏకంగా 28 మంది ప్రాణాలు కోల్పోయారు. 54 మంది ప్రయాణికులతో బస్సు దక్షిణ బలూచిస్తాన్‌లోని టర్బాట్ నగరం నుంచి ఉత్తరాన 750 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజధాని క్వెట్టాకు బయల్దేరింది. ఈ క్రమంలోనే కొండ ప్రాంతంలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కొండ ప్రాంతంలో మలుపు వద్ద బస్సు అదుపు తప్పింది. దాంతో.. డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. రోడ్డు పక్కకే ఉన్న లోయలో పడిపోయింది. ఈ సంఘటనలో డ్రైవర్ సహా మొత్తం 28 మంది స్పాట్‌లోనే చనిపోయారు. సుమారు 20 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
బస్సు లోయలో పడి 28 మంది దుర్మరణం
الأربعاء، 29 مايو 2024
20 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు pakistan అదుపుతప్పి లోయలో పడిపోయింది బస్సు లోయలో పడి 28 మంది దుర్మరణం
ليست هناك تعليقات:
إرسال تعليق