Ad Code

భార్య, ప్రియుడిని చెట్టుకు కట్టేసి కొట్టిన భర్త ?


రాజస్థాన్‌లోని బన్స్వారాలో తన భార్యను, ప్రేమికుడిని ఓ చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటన చోటు చేసుకుంది. కాగాఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది. భర్తను అరెస్టు చేసినట్లు పోలీసులు గురువారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రీనా (25), ప్రియుడు రవికుమార్ ప్రేమించుకున్నారు. అయితే.. రమేశ్ రెతువా (27) అనే వ్యక్తితో రీనాకు పెళ్లి అయింది. రీనాకు రమేశ్ తో ఉండటం ఇష్టం లేక గత వారం ప్రేమికుడితో కలిసి ఇంట్లో నుంచి పారిపోయింది. కాగా భర్త రమేష్ రెతువా తన సహచరులతో కలిసి వెతికి బుధవారం స్వగ్రామానికి తీసుకొచ్చాడు. అనంతరం భార్యను, ప్రేమికుడిని చెట్టుకు కట్టేసి భర్త చితకబాదాడు. అయితే తన భర్తతో ఉండటం ఇష్టం లేదని, అందుకే ప్రియుడితో కలిసి వెళ్లినట్లు రీనా తెలిపింది. ఈ క్రమంలో భర్త రమేష్, అతని సహచరులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు రమేష్‌ను గురువారం అరెస్టు చేసి మరో ఏడెనిమిది మందిపై కేసు నమోదు చేశారు. మిగిలిన నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu