మణిపూర్ లోని ఇంఫాల్ తూర్పు జిల్లాలోని నోంగ్డామ్, ఇథమ్ గ్రామాలను కలిపే రహదారిపై రోడ్డుపై అమర్చిన మూడు బాంబులను ఆర్మీ జవాన్లు గుర్తించి ఆ ప్రాంతాన్ని మూసివేశారు. అనంతరం బాంబు స్క్వాడ్ ను రప్పించి ఆ బాంబులను నిర్వీర్యం చేశారు. కాగా, ఆర్మీ జవాన్ల రొటీన్ తనిఖీల సందర్భంగా రోడ్డుపై అమర్చిన ఐఈడీలను గుర్తించినట్లు ఆర్మీ అధికారి తెలిపారు. మాఫౌ డ్యామ్, నోంగ్డామ్ గ్రామానికి సమీపంలో ఈ బాంబులు ఉన్నట్లు చెప్పారు. బాంబు స్క్వాడ్ సహాయంతో రోడ్డుపై అమర్చిన ఐఈడీలను నిర్వీర్యం చేసినట్లు వివరించారు. దీంతో ప్రాణ నష్టం జరుగకుండా, స్థానికులకు గాయాలు కాకుండా నిరోధించినట్లు వెల్లడించారు.
మణిపూర్ లో రోడ్డుపై అమర్చిన మూడు బాంబులను నిర్వీర్యం చేసిన ఆర్మీ !
الأحد، 26 مايو 2024
Manipur నోంగ్డామ్ గ్రామానికి సమీపంలో మణిపూర్ లో రోడ్డుపై అమర్చిన మూడు బాంబులను నిర్వీర్యం చేసిన ఆర్మీ మాఫౌ డ్యామ్ రొటీన్ తనిఖీల సందర్భంగా
ليست هناك تعليقات:
إرسال تعليق