ఏఐ టెక్నాలజీతో పనిచేసే సెక్యూరిటీ కెమెరా ఈఎల్-3 కు ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఎజ్విజ్ రూపకల్పన చేసింది. ఈ సెక్యూరిటీ కెమెరాలో ప్రకాశవంతమైన లైట్‌ను ఏర్పాటుచేశారు. ఇది రాత్రిపూట మీ ఇంటిని సురక్షితంగా ఉంచడంతోపాటు పరిసరాలను కూడా ప్రకాశవంతంగా మార్చేస్తుంది. ఏఐ ఆధారంగా పనిచేస్తూ ఇంటి చుట్టుపక్కల నిత్యం సంచరించే వ్యక్తులు, వాహనాలను గుర్తిస్తుంది. ఈ స్మార్ట్ సెక్యూరిటీ కెమెరా 2కే రిజల్యూషన్‌తో వీడియోలు తీస్తుంది. ఇందులో రికార్ట్ అయిన వ్యక్తుల ముఖాలను స్పష్టంగా చూపిస్తుంది. ఇందులో కలర్ నైట్ విజన్, బిల్ట్ ఇన్ స్పాట్‌లైట్ టెక్నాలజీని పొందుపరిచారు. దీంతో రాత్రిపూట కాంతి తక్కువగా ఉన్నప్పటికీ.. స్పష్టమైన చిత్రాలను అందిస్తుంది. వైఫై 6తో స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ అవుతుంది. కెమెరాలో రికార్డవుతున్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీ స్మార్ట్‌ఫోన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.
ఏఐ టెక్నాలజీతో పనిచేసే సెక్యూరిటీ కెమెరా !
الأحد، 19 مايو 2024
science technology ఇంటిని సురక్షితంగా ఉంచడంతోపాటు పరిసరాలను కూడా ప్రకాశవంతంగా మార్చేస్తుంది ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఎజ్విజ్ రూపకల్పన ఏఐ టెక్నాలజీతో పనిచేసే సెక్యూరిటీ కెమెరా ఈఎల్-3
ليست هناك تعليقات:
إرسال تعليق